రేపు మహాకుంభమేళాకు ప్రధాని మోదీ
ఉత్తరప్రదేశ్ లో అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళ జరుగుతున్న విషయం తెలిసిందే.
దేశ విదేశాల నుంచి ఎంతో మంది భక్తులు ఈ వేడు కలో పాల్గొని గంగా, య మునా, సరస్వతీ నదుల త్రివేణి సంగమం లో పుణ్య స్నానాలను ఆచరిస్తున్నా రు.
ఈ సందర్బంగా ఈనెల 5వ తేదీన భారత ప్రధాని మోదీ మహాకుంభమేళాను సందర్శించనున్నారు.
ఈ నేపథ్యంలో ప్రధాని రాక కోసం యూపీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానమంత్రి రేపు ఉదయం 10 గంటలకు మహా కుంభమేళాకు చేరుకుంటారు.
ఇక్కడి నుండి ఆయన అరయిల్ ఘాట్ నుండి పడవ ద్వారా సంగం వెళ్తారు. ప్రధాని మోదీ ప్రయాగ్‌రాజ్‌లో దాదాపు గంటసేపు ఉంటారు.
రేపు బుధవారం ఉదయం 10 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో బమ్రౌలి విమానాశ్రయానికి చేరుకుంటారు. -దీని తరువాత, మూడు ఆర్మీ హెలికాప్టర్లు అరయిల్‌లోని డిపిఎస్ గ్రౌండ్‌లోని హెలిప్యాడ్ దిగుతారు
అక్కడి నుండి కారులో విఐపి జెట్టీకి వెళ్తారు అక్కడి నుండి నిషాదరాజ్ సంగమంలో స్నానం చేయడానికి క్రూయిజ్ ద్వారా వెళ్తారు