రాష్ట్రంలో మరో జల విమాన విహారం
రాష్ట్రంలో పర్యాటకులకు కొత్త అనుభూతి కల్పించేలా జలవిమాన (సీప్లేన్) విహారాన్ని పూర్తిస్థాయిలో నిర్వహించేందుకు కసరత్తు జరుగుతోంది. రాష్ట్రంలో అనుకూల ప్రదేశాలపై విమానయానసంస్థలు అధ్యయనం చేస్తున్నాయి. ఇటీవల విశాఖ, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో స్పైస్ జెట్ సంస్థ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇప్పటికే విజయవాడ ప్రకాశంబ్యారేజి నుంచి శ్రీశైలంవరకు సీ ప్లేన్ విహారం పరిశీలన విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే