చిన్నారి శ్రీతేజ్‌ను మెరుగైన వైద్యం నిమిత్తం విదేశాలకు తరలించే అవకాశం.
కోమాలో నుంచి బయటికి వచ్చినా ఇంకా ఎవరినీ గుర్తు పట్టని చిన్నారి
రెండు నెలలుగా చికిత్స అందిస్తున్నా ఇంకా పూర్తిగా కోలుకోని శ్రీతేజ్
డిసెంబర్ 4న ‘పుష్ప 2’ బెనిఫిట్ షో సందర్బంగా సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డ శ్రీతేజ్
ఈ తొక్కిసలాటలో శ్రీతేజ్ తల్లి రేవతి మృతి చెందిన విషయం తెలిసిందే
శ్రీతేజ్ ఆరోగ్యంపై కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన
దీంతో విదేశాలకు తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించాలా?.. విదేశీ డాక్టర్స్‌ని పిలిపించాలా అనే యోచనలో ‘పుష్ప’ చిత్ర యూనిట్
తాజాగా శ్రీతేజ్‌ను పరామర్శించిన నిర్మాత బన్నీ వాసు
శ్రీతేజ్ మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తీసుకెళ్లాలని చర్చించినట్లు సమాచారం