ఆన్లైన్ ట్రేడింగ్ స్కాం పట్ల జాగ్రత్త

V. Sai Krishna Reddy
2 Min Read

ఆన్‌లైన్ ట్రేడింగ్ స్కామ్ప పట్ల జాగ్రత్త

ఈ స్కామ్‌లో, సైబర్ నేరస్థులు సోషల్ మీడియా టెలిగ్రామ్, పేస్ బుక్ మరియు ఇంస్టాగ్రామ్  ప్లాట్‌ఫామ్‌లలో లేదా వాట్సాప్‌లో ఉచిత ట్రేడింగ్ మెలుకువలు, చిట్కాలు ఇస్తామని ప్రకటనలను ఇస్తారు.

భాధితులు ఆ ప్రకటనపై క్లిక్ చేసినప్పుడు, వారు తెలియని వాట్సాప్ , టెలిగ్రామ్ గ్రూపుకు మళ్ళించబడతారు.

సైబర్ మోసగాళ్ళు ఈ గ్రూపుల ద్వారా బాధితులతో కమ్యూనికేట్ చేస్తారు.

స్టాక్‌లను కొనుగోలు చేయడానికి మరియు విక్రయించడానికి ఉచిత ట్రేడింగ్ సలహాలు అందించడం ద్వారా పెట్టుబడి పెట్టమని వారిని ఒప్పిస్తారు.

కొన్ని రోజుల తర్వాత స్టాక్‌లను ట్రేడింగ్ చేయడంలో భారీ లాభాలను పొందవచ్చని నమ్మిస్తారు.

డబ్బు సంపాదించడంలో మరింత మార్గదర్శకత్వం కోసం మోసగాళ్ళు అందించిన ట్రేడింగ్ అప్లికేషన్‌లను ఇన్‌స్టాల్ చేయమని బాధితులను కోరతారు.

వారి సూచనలకు అనుగుణంగా బాధితులు “సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా” (SEBI) కింద నమోదు కాని కొన్ని అప్లికేషన్‌లను ఇన్‌స్టాల్ చేస్తారు.

మోసగాళ్ల చెప్పినట్లుగా నమోదు చేసుకుని స్టాక్ ట్రేడింగ్‌ను ప్రారంభిస్తారు.

షేర్లను కొనుగోలు చేయడానికి మొత్తం బాధితులచే సైబర్ మోసగాళ్లు వాళ్ళు పేర్కొన్న బ్యాంకు ఖాతాలలో డబ్బు జమ చేపిస్తారు .

బాదితులకు ఒక నకిలీ డిజిటల్ వాలెట్ సృష్టిస్తారు. ఈ నకిలీ డిజిటల్ వాలెట్‌లో లాభాలు వచ్చినట్లు చూపిస్తారు.

బాధితులు డిజిటల్ వాలెట్ నుండి తమ ‘లాభాన్ని’ ఉపసంహరించుకోవడానికి ప్రయత్నించినప్పుడు, వారు వివిధరకాల ఆంక్షలుపెడ్తారు. 2.5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ లాభాలను చేరుకున్నట్లయితే మాత్రమే విత్ డ్రా సాధ్యమవుతుందని చెబుతారు. దీనిని కంపెనీ పాలసీ అనిచెప్తారు, అది నమ్మి, మోసగాళ్ల సూచనల ప్రకారం బాధితులు పెట్టుబడి పెడతారు.

ఒక సమయంలో, బాధితులు సంపాదించిన లాభాలకు పన్ను మొత్తాన్ని చెల్లించమని అడుగుతారు. వారు నిరాకరిస్తే, అన్ని కమ్యూనికేషన్‌లు ఆగిపోతాయి మరియు వినియోగదారు బ్లాక్ చేయబడతారు. అప్పుడే చాలా మంది తాము మోసపోయామని గ్రహిస్తారు.

కాబట్టి అనుమానాస్పద లింకులను స్పందించకండి.

పెట్టుబడి స్కామ్ గురించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

అనుమానాస్పద లింకులు, వాట్సాప్ కాల్స్ మరియు తెలియని నంబర్ల నుండి వచ్చే సందేశాలకు రెస్పాండ్ కావొద్దు.

విత్ డ్రా లేదంటే మోసపోయినట్లే.                     నూకల వేణు గోపాల్ రెడ్డి, డీఎస్పీ, సైబర్ సెక్యూరిటీ బ్యూరో, సంగారెడ్డి జిల్లా.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *