మాసాయిపేట మండలం రామంతపూర్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఈనెల 8వ తేదీ తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో మతిస్థిమితం లేకుండా రోడ్డుపై వెళ్తున్న ఒక యువతిని ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మద్యం మత్తులో ఉన్న యువకులకు రోడ్డుపై వెళ్తున్న మహిళ కనిపించగా ఆమెను తీసుకెళ్లి సాక్షాత్తు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వెనకాల ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు.
ఈ విషయం సీసీ కెమెరాలు రికార్డ్ అయినప్పటికీ నిందితులు ఎవరు దాన్ని గమనించలేదు. గ్రామంలో 10వ తేదీన స్వామి కి చెందిన ఒక్క బర్రె తప్పిపోగా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు సీసీ కెమెరా తనిఖీ చేస్తున్న క్రమంలో ఈ అత్యాచారం ఘటన వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి జిల్లా బాల్కొండకు చెందిన మతిస్థిమితం లేని సుమారు 30 సంవత్సరాల యువతీ పై అత్యాచారం చేసినట్లు గుర్తించిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాధితురాలిని మెదక్ భరోసా కేంద్రానికి తరలించారు. దీంతో రామాయంపేట సీఐ వెంకటరాజా గౌడ్ సంఘటన స్థలానికి చేరుకొని పూర్తిస్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు.