కొమురవెల్లి, మార్చి 26 (ప్రజా జ్యోతి):ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో భక్తుల కానుకలు భారీగా సమకూరాయి. గురువారం ఆలయ కార్యనిర్వహణాధికారి ఆధ్వర్యంలో నిర్వహించిన హుండీ లెక్కింపులో కేవలం 13 రోజుల్లోనే రూ. 60,82,771/- నగదు ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.భక్తులు తమ మొక్కుల రూపంలో మిశ్రమ బంగారం 36 గ్రాములు, మిశ్రమ వెండి 2 కిలోల 900 గ్రాములు,విదేశీ కరెన్సీ 127 నోట్లు వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి డి. కృష్ణ ప్రసాద్ తెలిపారు.ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో శివ రామకృష్ణ భజన మండలి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఆలయ ఈఓ శ్రీ డి. కృష్ణ ప్రసాద్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో కే. రవి కుమార్, సిద్దిపేట శరభేశ్వర దేవాలయ ఈఓ బుద్ధి శ్రీనివాస్, ఆర్. సుదర్శన్, పర్యవేక్షకులు ఎన్. చంద్రశేఖర్, స్థానాచార్య పి. మల్లయ్య, ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున్ పాల్గొన్నారు.వీరితో పాటు ఆలయ సిబ్బంది, పోలీస్ యంత్రాంగం, స్వర్ణకారుడు నర్సింహాచారి మరియు ఎస్‌బీఐ బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.
