నేటి ఆవిష్కర్తలే రేపటి శాస్త్రజ్ఞులు 

Nalgonda Bureau
1 Min Read

సూర్యాపేట జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 28(ప్రజాజ్యోతి):సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ రోడ్డులో గల జీఆర్ వివేకవాణి విద్యా మందిర్ హైస్కూల్ లో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలలో భాగంగా సైన్స్ ఎక్స్ పో, సైన్స్, జీకే విశాలపై నిర్వహించిన క్విజ్ కాంపిటీషన్ లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇరిగేషన్ సిస్టమ్, మోటార్ రన్నింగ్ సిస్టమ్, హైడ్రాలిక్ వర్కింగ్ సిస్టమ్ వంటి విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.ఈ సందర్భంగా ఆ పాఠశాల కరస్పాండెంట్ ప్రిన్సిపాల్ గుడిమళ్ల సంతోష్ శర్మ, గుడిమళ్ల స్వప్న మాట్లాడుతూ నేటి ఆవిష్కర్తలే రేపటి శాస్త్రజ్ఞులని అన్నారు.అనంతరం విద్యార్థులకు బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *