లక్ష సిద్దార్థ్ జన్మదిన వేడుకలు ఘనంగ

Kamareddy
1 Min Read

లక్ష సిద్దార్థ్ జన్మదిన వేడుకలు ఘనంగ

కామారెడ్డి రూరల్, ఫిబ్రవరి 21 (ప్రజా జ్యోతి

కామారెడ్డి మండలం పరిధిలోని ఇస్రోజీవాడి గ్రామంలో లక్ష సిద్దార్థ్ జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొని, కుటుంబ సభ్యులు, స్నేహితులు, మిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా లక్ష సిద్దార్థ్ కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్నవారు ఆయనకు దీర్ఘాయుష్షు, ఆరోగ్యం, విజయాలు కలగాలని ఆకాంక్షించారు. గ్రామ పెద్దలు ఆశీర్వదిస్తూ ఆయన భవిష్యత్తు ఉండాలని కోరుకున్నారు.

జన్మదినాన్ని పురస్కరించుకుని కొంతమంది పిల్లలకు స్వీట్లు పంపిణీ చేయడంతో పాటు స్నేహితులతో ఆనందంగా గడిపారు. ఈ వేడుకలు గ్రామంలో ఉత్సాహభరితంగా సాగి అందరినీ ఆకట్టుకున్నాయి.

గ్రామ ప్రజలు మాట్లాడుతూ లక్ష సిద్దార్థ్ సమాజ సేవలో కూడా ముందుండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమం చివర్లో కుటుంబ సభ్యులు హాజరైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *