బీఆర్‌ఎస్‌కు భారీ షాక్ కోదాడ లో కాంగ్రెస్‌లోకి 100 మంది చేరికలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి అభివృద్ధికి ఆకర్షితులై బీఆర్‌ఎస్ వీడిన మల్లు బిక్షమా రెడ్డి కుటుంబం

Nalgonda Bureau
1 Min Read

కోదాడ టౌన్,ఫిబ్రవరి 06 (ప్రజా జ్యోతి):బీఆర్‌ఎస్‌కు భారీ షాక్ ఇచ్చి కాంగ్రెస్‌లోకి 100 మంది కార్యకర్తలు శుక్రవారం మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.కొదాడ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరంగాపురం 5వ వార్డులో బీఆర్‌ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, ప్రముఖ వ్యాపారవేత్త మల్లు బిక్షమా రెడ్డి, ఆయన తమ్ముడు మల్లు వెంకట్ రెడ్డితో పాటు 10 కుటుంబాలు, వ్యాపార కస్టమర్లు కలిపి సుమారు 100 మంది కార్యకర్తలు బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.కొదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజాప్రయోజన విధానాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు.మల్లు బిక్షమా రెడ్డి సీనియర్ రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా విస్తృత వ్యాపార పరిచయాలు కలిగిన వ్యక్తిగా 5వ, 6వ వార్డుల్లో మంచి ప్రభావం కలిగి ఉన్నారని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం అహర్నిశలు కృషి చేసే నాయకత్వ లక్షణాలు ఆయనలో ఉన్నాయని పలువురు అభిప్రాయపడ్డారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని తెలిపారు. కొదాడ నియోజకవర్గంలో ఉత్తమ్ పద్మావతి రెడ్డి నాయకత్వంలో వేగంగా అభివృద్ధి జరుగుతుండటంతో ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి చేరికలు పెరుగుతున్నాయని చెప్పారు.ఈ కార్యక్రమంలో 5వ, 6వ వార్డుల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బొలిశెట్టి రాము, తుమ్మల నాగేంద్రమ్మ కన్నయ్య, సీనియర్ నాయకులు వనపర్తి రామయ్య, బెక్కం వెంకటేశ్వర్లు, బొలిశెట్టి వెంకట్ నారాయణ, తుమ్మల గోపయ్య, తుమ్మల బాబు, నల్లాని కొండయ్య, చీకటి శ్రీను, మల్లు కుటుంబ సభ్యులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *