అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేస్తా

Rangareddy Bureau
1 Min Read

– బిజెపి పార్టీ అభ్యర్థి అత్తెలి మనీషా అనంత్ రెడ్డి

– 12 వ వార్డులో ఇంటింటికి బిజెపి ప్రచారం

చేవెళ్ల, ఫిబ్రవరి 06 (ప్రజా జ్యోతి):
వార్డు ప్రజలు ఆశీర్వదించి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని బిజెపి పార్టీ అభ్యర్థి అత్తెలి మనీషా అనంత్ రెడ్డి ప్రజలను కోరారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం చేవెళ్ల పట్టణంలోని 12 వ వార్డులో బిజెపి నాయకులు, మహిళలు, యువకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ప్రజా సేవే తన లక్ష్యమని, వార్డు అభివృద్ధే ధ్యేయంగా ఎన్నికల బరిలోకి దిగుతున్నానని తెలిపారు. వార్డులో ప్రతి కుటుంబాన్ని ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ, పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు నిండు మనస్సుతో ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. వార్డులో మౌలిక వసతుల కల్పనకు తొలి ప్రాధాన్యత ఇస్తానని, తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వంటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఎప్పుడూ అందుబాటులో ఉండి ప్రజలకు అండగా నిలుస్తానని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బిజెపి పార్టీ కమలం గుర్తుకే ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *