10 గంటల్లోనే చోరీ కేసును ఛేదించిన చేర్యాల పోలీసులు
చేర్యాల ఫిబ్రవరి 05(ప్రజాజ్యోతి):చేర్యాల పోలీసులు 10 గంటల్లోనే దొంగతనం కేసు ఛేదించి, నిందితుడిని అరెస్ట్ చేశారు. చుంచనకోట గ్రామంలో జరిగిన ఈ ఘటనలో, నిందితుడు ఆరపల్లి వంశీకృష్ణ 27 గ్రాముల బంగారు పుస్తెల తాడును దొంగిలించాడు. పోలీసులు సాంకేతిక ఆధారాల సాయంతో నిందితుడిని గుర్తించి, అరెస్ట్ చేశారు.హుస్నాబాద్ ఏసిపి సదానందం మాట్లాడుతూ, మహిళలు, ముఖ్యంగా వృద్ధులు ఒంటరిగా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గ్రామస్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గ్రామ ప్రవేశ మార్గాలు, నిష్క్రమణ మార్గాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు.
