బి ఫామ్ ..ఎవరికి.? టికెట్ల కోసం అభ్యర్థుల కుస్తీ..

Warangal Bureau
2 Min Read

బి ఫామ్ ..ఎవరికి.?

టికెట్ల కోసం అభ్యర్థుల కుస్తీ

నేతల చుట్టూ ఆశావాహుల ప్రదక్షిణలు.

సర్వే రిపోర్ట్ తో గెలుపు గుర్రాలకే టికెట్టు కాంగ్రెస్

పట్టు సాధించేందుకు బిఆర్ఎస్, బిజెపి వ్యూహాలు.

వర్ధన్నపేట ఫిబ్రవరి 2, ప్రజా జ్యోతి

వరంగల్ జిల్లా, వర్ధన్నపేట మున్సిపాలిటీ రెండవ సాధారణ ఎన్నికలు 2026 నామినేషన్ ప్రక్రియ శుక్రవారంతో ముగియగా, ఇప్పుడు పోటీదారుల దృష్టి అంతా బి ఫామ్ పొందడం పైనే కేంద్రీకృతమైంది. నామినేషన్ వేషం కానీ పార్టీ టికెట్ దక్కితే గెలుపు సాధ్యం అయినట్టే అనే భావనతో ఆశవాహులు నేతల చుట్టూ తిరుగుతూ కుస్తీలు పడుతున్నారు. ఒకే వార్డులో కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి పార్టీల నుంచి ముగ్గురు, నలుగురు వరకు నామినేషన్లు దాకాలు కావడంతో అసలు టికెట్ ఎవరికీ దక్కుతుందని అంశంపై ఉత్కంఠ నేలకోంది. బి ఫామ్ వచ్చేవరకు టెన్షన్ తప్పదని అభ్యర్థులు చెబుతున్నారు. నేతల వద్ద హామీలు పొందే వరకు అడుగులో అడుగులు వేస్తూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

సర్వేల ఆధారంగా టికెట్ల కేటాయింపు.

 ప్రధాన పార్టీలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో బలం అంచనా వేసేందుకు సర్వేలు చేయించాయి. గెలుపు అవకాశాలు ఉన్నవారికి టికెట్లు ఇస్తామని కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి లు ప్రకటించాయి. రాష్ట్రస్థాయి నేతలు ఈ నివేదికలను పరిశీలిస్తూ అభ్యర్థుల ఎంపికలో తుది నిర్ణయాలకు సిద్ధమవుతున్నారు. నామినేషన్ల కు కేవలం మూడు రోజుల గడువు మాత్రమే ఉండడంతో చాలామంది బీఫాములు లేకుండానే నామినేషన్లు వేశారు. బి ఫారాలు సమర్పించినందుకు మరో గడువు ఉండడంతో ఈలోపు నేతలను మచ్చిక చేసుకుని టికెట్ సాధించాలని అభ్యర్థులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

కాంగ్రెస్ గెలుపు ధీమా.

 వర్ధన్నపేట మున్సిపాలిటీ లో ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ వ్యూహాలకు ప్రతి వ్యూహాలు సిద్ధం చేస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు, ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వర్గ పోరును చల్లార్చి ఐక్యతతో గెలవాలని నేతలకు సూచిస్తున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *