నామినేషన్ సెంటర్ ను సందర్శించిన ఏసిపి సదానందం
చేర్యాల జనవరి30(ప్రజాజ్యోతి):చేర్యాల పట్టణకేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లోని నామినేషన్ సెంటర్ ను హుస్నాబాద్ ఏసిపి సదానందం సందర్శించారు.ఈ సందర్భంగా ఏసిపి మాటాడుతూ..ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా ప్రజలు,నాయకులు సహకరించాలని కోరారు. ప్రచారాలు ,సమావేశాలు మరియు ర్యాలీల కొరకు పోలీస్ శాఖ నుండి తప్పకుండా పర్మిషన్ తీసుకోవాలని తెలియజేశారు.ఏసిపి వెంట సిఐ బానోత్ రమేష్ నాయక్, చేర్యాల ఎస్సై వేముల నవీన్, కొమురవెల్లి ఎస్సై తోట మహేష్ ,మున్సిపల్ కమిషనర్ నాగేందర్ ఉన్నారు.
నామినేషన్ సెంటర్ ను సందర్శించిన ఏసిపి సదానందం
-ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు - సభలకు,ర్యాలీలకు పర్మిషన్ తప్పకుండా తీసుకోవాలి
Leave a Comment
