-
జాతీయ జెండాకు అవమానం
-
ఎగురవేసిన జెండాను దించడం మరిచిన నిర్వాహకులు
హనుమకొండ, జనవరి 27 (ప్రజాజ్యోతి):
జాతీయ పతాకానికి అవమానం జరిగిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రంప్పాడు గ్రామంలో సమ్మక్క సారలమ్మ జాతర సమీపంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో భాగంగా జాతీయ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండాను ఎగురవేసిన నిర్వాహకులు, నిబంధనల ప్రకారం జెండా దింపివేత చేయడం మరిచారు. కార్యక్రమం ముగిసిన తర్వాత కూడా జాతీయ జెండా అలాగే ఉండిపోవడంతో స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం నిర్ణీత సమయంలో తప్పనిసరిగా అవగతం చేయాల్సి ఉండగా, నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల ఈ ఘటన చోటుచేసుకుందని విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ ఘటనపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జాతీయ పతాక గౌరవంపై అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడ్డారు.
నిత్యం గ్రామంలో అందుబాటులో ఉండే అధికారులు సైతం నిర్లక్ష్యం వహిస్తూ జాతీయ జెండాకు అవమానం జరుగుతుంటే నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరించటంతో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
