15 రోజుల క్రితం అదృశ్యమై.. స్థానిక చెరువులో శవమై.!

Bharath Goud
1 Min Read

నర్సాపూర్/కౌడిపల్లి (ప్రజాజ్యోతి) ముట్రాజ్ పల్లి గ్రామానికి చెందిన బంజ రవి అనే వ్యక్తి స్థానిక పెద్ద చెరువులో శవమై కనిపించాడు. గడిచిన 15 రోజుల క్రితం అదృశ్యం కాగా, బుధవారం మృతదేహం నీటిపై తేలుతుండటాన్ని గమనించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహం నీటిలో ఎక్కువ రోజులు ఉండటంతో పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉంది. మృతదేహాన్ని తరలించడం కష్టంగా ఉండటంతో, వైద్యులు చెరువు వద్దనే (ఘటనా స్థలంలోనే) పోస్టుమార్టం నిర్వహించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కౌడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రవి మరణానికి గల కారణాలు పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత తెలుస్తాయని, ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *