— సర్పంచ్ బండి ప్రవీణ్
రామారెడ్డి జనవరి 21 (ప్రజా జ్యోతి)
రామారెడ్డి మండల కేంద్రంలో సర్పంచ్ బండి ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన మార్కెట్ కమిటీ సదశివనగర్ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో మార్కెట్ కమిటీ చైర్మన్ సంగ్య నాయక్,గ్రామ ఉప సర్పంచ్ నవీన్, ఏఎంసి డైరెక్టర్ లు, మాజీ సర్పంచ్ రంగు రవీందర్ గౌడ్, మాజీ పిఎసిఎస్ వైస్ చైర్మన్ పశుపతి, మండల పశు వైద్య అధికారి రాంచందర్,నామాల రవి , గ్రామ పెద్దలు, పాడి రైతులు, గొర్రెల పెంపకం దారులు,గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు పాడి రైతులకు అందుబాటులో అప్పుడప్పుడు వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం పాడి రైతులకు ఎంతో మేలు చేసి వాళ్ల అభివృద్ధికి తోడ్పాటు గా సహాయ సహకారాలు అందించాలని గ్రామ సర్పంచ్ బండి ప్రవీణ్ అన్నారు.
