నర్సాపూర్ (ప్రజాజ్యోతి) సంక్రాంతి సంబరాల్లో మునిగితేలుతున్న నర్సాపూర్ పట్టణ ప్రజలను వర్షం పలకరించింది. బుధవారం రాత్రి ఒక్కసారిగా వాతావరణం చల్లబడి, పట్టణ కేంద్రంలో వర్షం కురిసింది. దీంతో అప్పటివరకు సందడిగా ఉన్న వీధులన్నీ నిశ్శబ్దంగా మారాయి. ఎనిమిది గంటల 20 నిమిషాలకు నుండి సుమారు పది నిమిషాల పాటు వర్షపు జల్లు కురిసింది.
