- రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన
- వర్ధన్నపేట ఎస్‌ఐ సాయిబాబు
వర్ధన్నపేట జనవరి 14, ప్రజా జ్యోతి
వర్ధన్నపేట మండలం, ఇల్లంద గ్రామంలోని ప్రధాన రహదారి పక్కన ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఎస్‌ఐ సాయిబాబు పాల్గొని రోడ్డు భద్రతపై ప్రజలకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం, డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ ద్వారా మాట్లాడటం, వాహనాల పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం వంటి నిర్లక్ష్యపు చర్యల వల్ల ఎన్నో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు.
అలాగే మైనర్ పిల్లలకు బైక్‌లు ఇవ్వడం మరో ప్రమాదకర ధోరణిగా మారిందని, దీంతో ప్రమాదాలు పెరుగుతున్నాయని హెచ్చరించారు. ప్రజలు రోడ్డు నియమాలు పాటిస్తే ప్రాణాలను కాపాడుకోవడంతో పాటు ప్రమాదాలను తగ్గించుకోవచ్చని సూచించారు.
