• (గ్రామవాసి యాద గౌడ్, సర్పంచ్, వార్డు సభ్యులకు సన్మానం)
నర్సాపూర్ (ప్రజాజ్యోతి) ఎన్నికల సమయంలో ఉండే విభేదాలను మర్చిపోయి గ్రామంలోని సమస్యల పరిష్కారం కోసం ప్రజలందరూ ప్రజా ప్రతినిధులతో కలిసి ముందుకు సాగాలని, ఐక్యత ఉన్నచోటే అభివృద్ధి సాధ్యమవుతుందని మంతుర్ గ్రామానికి చెందిన, హైదరాబాద్ నివాసి యాదగౌడ్ పేర్కొన్నారు. మండల పరిధిలోని మంతూర్ గ్రామ సర్పంచిగా గెలుపొందిన వెంకటేష్ మరియు వార్డు సభ్యులను శనివారం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఆయన శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా యాద గౌడ్ మాట్లాడుతూ.. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, వాటిని పక్కనపెట్టి గ్రామస్తులందరూ ఐక్యమత్యంతో గ్రామ అభివృద్ధికి సహకరించాలని సూచించారు. అనంతరం సర్పంచ్ వెంకటేష్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన గ్రామ ప్రజలందరికీ ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో మంతుర్ గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుగానని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గ్రామస్తులు సత్యనారాయణ గౌడ్, యాదగౌడ్, లింగం గౌడ్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
