అంగన్వాడి చిన్నారులతో నూతన సంవత్సర వేడుకలు
రామారెడ్డి జనవరి 02 (ప్రజా జ్యోతి)
చిన్నారులతో కలసి కేక్ కట్ చేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం రామారెడ్డి మండలం గిద్ద గ్రామంలోని అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి చిన్నారులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం అంగన్వాడి కేంద్రంలోని రిజిస్టర్లు, స్టోర్ రూమ్‌ను పరిశీలించి, అంగన్వాడి కేంద్రంలో అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపర్చాలని, మరమ్మత్తులు చేయించాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమం లో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, సంబంధిత ఐసిడిఎస్ సిబ్బంది. తదితరులు పాల్గొన్నారు.
