సూర్యాపేట జిల్లా ప్రతినిధి డిసెంబర్ 25(ప్రజాజ్యోతి):మానవాళిని ఉద్ధరించేందుకు, సర్వజనుల కోసం మానవతా మూర్తి ఏసుక్రీస్తు ప్రభువు జన్మించారని డబ్ల్యూఎంఈ చర్చ్ పాస్టర్ రెవ.డా.జాన్ మార్క్ అన్నారు. గురువారం క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని సూర్యాపేట పట్టణంలోని గోపాలపురంలో గల డబ్ల్యూఎంఈ చర్చ్ లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ అని అన్నారు.సర్వమానవాళి సౌభ్రాతృత్వం కోసం ఏసు ప్రభువు బోధనలు ఆచరణీయమని అన్నారు. ప్రేమ, కరుణ, సహనం, త్యాగం, దాతృత్వం, క్షమాగుణం ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి ఏసుక్రీస్తు ప్రభువు అందించిన మహోన్నత సందేశాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సుదర్శన్, ప్రకాశం, దేవబిక్షం, వెంకన్న,జాకోబ్, జాన్, రాజు, ప్రవీణ్,పలువురు విశ్వాసులు పాల్గొన్నారు.
