ఢిల్లీకి బయలుదేరిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

V. Sai Krishna Reddy
1 Min Read

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీకి పయనమయ్యారు. రేపు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటున్నారు. ఢిల్లీలో నూతనంగా నిర్మించిన ఏఐసీసీ కార్యాలయం ఇందిరా భవన్‌లో రేపు ఉదయం 10.30 గంటలకు అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ కీలక సమావేశం ప్రారంభం కానుంది.

ఈ సమావేశంలో, దేశవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ పరిస్థితులు, మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు, రాబోయే ఎన్నికలు, పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్లు సమాచారం. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తదితరులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *