- మాధవ సేవగా సర్వప్రాణి సేవ
- -శ్రీశ్రీశ్రీ దేవనాథ జీయర్ స్వామి
ఆత్మకూరు/ప్రజాజ్యోతి
ప్రతి ఒక్కరూ మాధవసేవగా సర్వప్రాణి సేవ లక్ష్యంగా ముందుకు సాగాలని సమాజ స్వరూపుడైన భగవంతున్ని ప్రార్థించడం అంటే సమాజానికి సేవ చేయడమే అని తెలుసుకోవాలని శ్రీశ్రీశ్రీ త్రిదండి దేవనాథ జీయర్ స్వామి అన్నారు. మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి వికాస తరంగిణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆచార్య సేవగా భగవత్ భాగవత సేవ అనే కార్యక్రమంలో హాజరై భక్తులకు సందేశాన్ని అందజేశారు. భక్తులు స్వామిని పోచమ్మ సెంటర్ నుండి ఆలయం వరకు భజనలు కోలాటం తో శోభా యాత్ర ద్వారా స్వామిని ఆలయానికి తీసుకువచ్చారు. అర్చకులు ఆరుట్ల మాధవ మూర్తి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దేవనాథ జీయర్ స్వామి మాట్లాడుతూ ధనుర్మాస వ్రతంలో భక్తులు గోదాదేవి ఆచరించిన వ్రతాన్ని భక్తులు ఆచరించాలని అన్నారు. భక్తులు సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని అన్నారు. కార్యక్రమంలో వికాస తరంగిణి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బచ్చు రాధాకృష్ణ, జిల్లా కార్యవర్గ సభ్యుడు పోలు రాజేష్ కుమార్, దయాకర్ రెడ్డి, తిరుమల్ రావు, ఆరుట్ల కేశవమూర్తి, అర్చకులు ఆరుట్ల మాధవమూర్తి, ఆత్మకూరు శాఖ అధ్యక్షుడు టింగిలికారి సత్యనారాయణ, కార్యదర్శి నాగబండి శివప్రసాద్, భజన మండలి అధ్యక్షుడు పరికిరాల వాసు, ఉప్పునూతుల శంకర్, పలుకల మంజుల, కొండబత్తుల వేణు, గుండెబోయిన కుమార్, రేవూరి జైపాల్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.


