సిపిఆర్ & బిఎల్ఎస్ అవగాహన ప్రతి ఒక్కరికి ఉండాలి: స్వాతి లక్రా ఐపీఎస్

V. Sai Krishna Reddy
1 Min Read

సిపిఆర్ & బిఎల్ఎస్ అవగాహన ప్రతి ఒక్కరికి ఉండాలి: స్వాతి లక్రా ఐపీఎస్

శేరిలింగంపల్లి, డిసెంబర్ 22 (ప్రజాజ్యోతి):
తెలంగాణ ఆనంపల్లి లో టీజీ ఎస్ పీఎఫ్ స్వాతి లక్రా ఐపీఎస్ డైరెక్టర్ జనరల్ టీ జిఎస్ పిఎఫ్ వారి ఆధ్వర్యంలో వారి పిలుపు మేరకు సిపిఆర్, బి ఎల్ ఎస్ పై ప్రతి ఒక్క సిబ్బంది కి వాటిపై అవగాహన అవసరం అని ఆమె తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో పనిచేయుచున్న ప్రతి పీజీ ఎస్ పి ఎల్ సిబ్బందికి సిపిఆర్, బి ఎల్ ఎస్ అవగాహన శిబిరాలను ఏర్పాటు చేసి వారికి అవగాహన కల్పించాలని ఆమె తెలిపారు. వారి ఆదేశాల ప్రకారం తెలంగాణ అసెంబ్లీ యందు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నందు ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ అమీర్ పేట్ వారితో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సదస్సును ఉద్దేశించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని రక్షించాలంటే సిపిఆర్, బి ఎల్ ఎస్ ప్రతి ఒక్కరికి అవగాహన ముఖ్యం అని అంతేగాక ప్రాణాపాయ అత్యవసర పరిస్థితులలో ఉపయోగపడుతుందని సి. జంగయ్య కమాండెంట్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ తిరుపతి, ఇన్స్పెక్టర్ సత్తయ్య, మౌలాలి, ఎస్సై లు, ఐఏఎస్ లు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *