ఎఫ్ఎస్టి అధికారుల దాడులు 384 క్వార్టర్ల మద్యం పట్టివేత

Bharath Goud
1 Min Read

 

★ నిబంధనలు ఉల్లంఘించి అక్రమ మద్యం తరలింపు

★ చాకచక్యంగా పట్టుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్ టీం…!

————————————————————–

నర్సాపూర్ (ప్రజాజ్యోతి) ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ, ఓటర్లను ప్రలోభపెట్టేందుకు జరుగుతున్న అక్రమ మద్యం రవాణాకు ఎలక్షన్ “ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్” మండలంలోని లింగాపూర్ గ్రామ శివారులో బ్రేక్ వేసింది. అత్యంత చాకచక్యంగా వ్యవహరించిన అధికారులు, ఆటోలో తరలిస్తున్న భారీ మొత్తంలో B-7 మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నేడు (బుధవారం) సాధారణ తనిఖీల్లో భాగంగా విధులు నిర్వహిస్తున్న ఎఫ్ఎస్టీ బృందానికి ఒక ఆటో అనుమానాస్పదంగా కనిపించింది. అధికారులు ఆటోను ఆపేందుకు ప్రయత్నించగా, డ్రైవర్ మరింత వేగం పెంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. గమనించి అప్రమత్తమైన అధికారులు ఆటోను పట్టుకున్నారు. అందులో 8 కాటన్ల B-7 మద్యాన్ని గుర్తించారు. పట్టుబడిన ఈ స్టాక్‌లో మొత్తం 384 క్వార్టర్ సీసాలు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యాన్ని, ఆటో డ్రైవర్‌ను స్థానిక పోలీస్ స్టేషన్‌‘లో అప్పగించారు. మద్యం తరలింపు పై విచారణ కొనసాగుతుండగా, పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *