అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా
- నీరుకుళ్ళ భరిలో యువ నాయకురాలు
- అన్ని వర్గాల ప్రోత్సాహంతో ముందుకు
- యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యం
- మాజీ ఎమ్మెల్యే చల్లా ఆశీర్వాదంతో ముందుకు
ఆత్మకూరు, డిసెంబర్ 10 (ప్రజాజ్యోతి):
గ్రామాభివృద్ధి లక్ష్యంగా మహిళలు కూడా నాయకత్వ బాధ్యతల్లో ముందుకు రావాలని సమాజం కోరుతున్న తరుణంలో, ఆత్మకూరు మండలం నీరుకుళ్ళ గ్రామానికి చెందిన శ్రీమతి తడక నీరజ సర్పంచ్ పదవికి తన నామినేషన్ దాఖలు చేశారు. గ్రామంలోని అన్ని వర్గాలను కలుపుకొని గ్రామ అభివృద్ధికి ముందుకు వచ్చింది. పారదర్శక పరిపాలన, శుభ్రమైన గ్రామం, సుందరమైన గ్రామం, యువత అభివృద్ధి, మహిళా సాధికారత, తాగునీరు–రోడ్లు–లైటింగ్ వంటి ప్రాథమిక అవసరాల పురోగతి కోసం పనిచేస్తానని ఆమె చెప్పింది. గ్రామ ప్రజల ఆశీర్వాదం, మహిళల మద్దతుతో విజయం సాధించి గ్రామ అభివృద్ధికి తన సేవలను అంకితం చేస్తానని అభ్యర్థి తెలిపారు. నామినేషన్ దాఖలు సమయంలో పెద్ద సంఖ్యలో మహిళలు, యువత, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు ఆమెకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఎన్నికల్లో విజయం కోసం గ్రామంలోని అన్ని వర్గాలు పాటుపడుతున్నాయి.
