– ఆశతో కాదు ఆశయంతో మీ ముందుకు వస్తున్న ఆశీర్వదించండి
– ప్రస్తుత కాలానికి అనుగుణంగా అభివృద్ధి
– గ్రామ పేదరిక నిర్మూలన దిశగా
– గ్రామ అభివృద్ధికి పెద్దపీట
– విద్యా ఉపాధి అవకాశాలు పెంపొందేల కృషి
భిక్కనూరు, డిసెంబర్ 9 (ప్రజాజ్యోతి)
భిక్కనూరు మండలం కంచర్ల గ్రామానికి చెందిన గొల్ల అరుణ కత్తెర గుర్తుతో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉంది. పచ్చని ప్రకృతి ఒడిలో మారుమూల గ్రామంగా, అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న నా గ్రామ అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడడం కోసం ఎలాంటి పోరు చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపింది.
గ్రామ శ్రేయస్సు కొరకు
1 విద్య ఉపాధికి మొదటి ప్రాధాన్యత
2 డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరుస్తూ ఆరోగ్యవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుతా
3 సీసీ రోడ్ల నిర్మాణం, వీధి దీపాల పునరుద్ధరణ
4 నల్ల లేని వారికి నల్లా కనెక్షన్
5 రామ అభివృద్ధి కోసం ఇంతటి కష్టాన్నైనా ఇష్టంగా స్వీకరిస్తానని, ఇంటింటి ప్రచారంలో భాగంగా గొల్ల అరుణ ఓటర్ల ను ఆకర్షించే దిశగా పైన చెప్పిన అభివృద్ధి పనులన్నీ చేయడానికి ఎల్లవేళలా కట్టుబడి ఉంటానని, గ్రామ అభివృద్ధిని జిల్లా వరకు వ్యాపించేలాగా కృషి చేస్తానని,ప్రజాక్షేత్రంలో 24 గంటలు ఉండి అభివృద్ధి అంటే c/oకంచర్ల అనేలా చేస్తానని హామీ ఇచ్చింది.
