- స్థానిక ఎన్నికల్లో నల్లబెల్లి మండలంలో 18 వార్డులు ఏకగ్రీవ
- ఎంపీడీవో జే శుభానివాస్
నల్లబెల్లి, డిసెంబర్ 7 ( ప్రజా జ్యోతి):
నల్లబెల్లి మండలంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాల పర్వం కొనసాగింది. మండలంలోని మొత్తం వార్డుల్లో 18 వార్డులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) డా. జె. శుభానివాస్ తెలిపారు. ఆదివారం ప్రకటన ద్వారా ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. సర్పంచ్ పదవికి మొత్తం 29 గ్రామపంచాయతీలకు 172 నామినేషన్లు దాఖలు కాగా, ఉపసంహరణ గడువు ముగిసేనాటికి 82 నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో సర్పంచ్ పదవికి తుదిగా 90 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.
వార్డుల వివరాలు
మండలంలోని మొత్తం 252 వార్డులు ఉండగా, వీటిలో 18 వార్డులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. పోటీలో ఉన్న అభ్యర్థులు ఏకగ్రీవం కాని మిగిలిన వార్డుల్లో మొత్తం 546 మంది అభ్యర్థులు పోటీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఏకగ్రీవమైన గ్రామాలు
10 వార్డులు మూడు చెక్కలపల్లి గ్రామంలో అత్యధికంగా 10 వార్డులు ఏకగ్రీవమయ్యాయి.
8 వార్డులు: రామతీర్థం, గుండ్లపహాడ్, బజ్జితండా, కొండాపూర్, నల్లబెల్లి గ్రామాల్లో కలిపి మరో 8 వార్డులు ఏకగ్రీవమైనట్లు ఎంపీడీవో డా. జె. శుభానివాస్ వివరించారు.
దీంతో, పోలింగ్ జరగనున్న వార్డుల సంఖ్య తగ్గింది, ఎన్నికల నిర్వహణకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
