చివ్వెంల నవంబర్ 18(ప్రజా జ్యోతి):హైదరాబాద్ లోని ఆరోగ్య సచివాలయంలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వ్యాప్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఫలితాలు సోమవారం విడుదల చేయగా మండల పరిధిలోని హుస్సేనాబాద్ గ్రామానికి చెందిన బైరపంగు స్వాతి ఎస్సీ కేటగిరి చెందిన,ఓపెన్ కేటగిరిలో ప్రభుత్వ కొలువు సాధించింది.స్వాతి 2018 నుంచి కాంట్రాక్ట్ బేసిక్ లో చివ్వెంల మండల పరిధిలో పనిచేస్తూ కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ,ఉద్యోగం సాధించడం పట్ల కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.చిన్నప్పటినుండి రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యను అభ్యసించినట్లు ఆమె తెలిపారు 2024 లో సెప్టెంబర్ నోటిఫికేషన్ రాగా 2024 నవంబర్ 10న పరీక్ష నిర్వహించారు.కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఉద్యోగం సాధించినట్లు ఆమె తెలిపారు.
