- కారు అదుపుతప్పి యువకుడి మృతి
పర్వతగిరి, నవంబర్ 08 ప్రజాజ్యోతి::
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామ శివారులో జరిగింది. మహబూబాబాద్ జిల్లా గూడూరుకు చెందిన షేక్ సోహెల్ తండ్రి యాకుబ్ (24) గవిచర్లలోని బంధువుల ఇంటికి వెళ్లి తిరుగు ప్రయాణంలో కారు డ్రైవింగ్ చేస్తూ గూడూరు కి వెళ్తున్నక్రమంలో మార్గమద్యలో ఏనుగల్ గ్రామ శివారులో తెల్లవారుజామున దాదాపు 2 గంటల సమయంలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొని పట్టీ కొట్టి పాల్టీలు కొట్టగా కారులో ఉన్న సోహెల్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని పోలీసులు ఎంజీఎంకు తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

