క్రీడాల్లో గెలుపు ఓటములు సహజం

* ఆర్డీఓ పార్థసింహరెడ్డి
ఎల్లారెడ్డి, నవంబర్-4(ప్రజా జ్యోతి)
క్రీడాకారులు క్రీడల్లో గెలుపోటములను సమానంగా స్వీకరించాలని ఎల్లారెడ్డి ఆర్డీఓ పార్థసింహరెడ్డి అన్నారు. మంగళవారం ఎల్లారెడ్డి మండలంలోని మాచపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రెజ్లింగ్ అండర్-14,17 బాలుర, బాలికల పోటీని ప్రారంభించారు. ఈ పోటీల్లో ఉమ్మడి జిల్లాల నుంచి వివిధ పాఠశాలల క్రీడాకారులు అండర్-14లో 120 మంది, అండర్-17 నుంచి 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆర్డీఓ మాట్లాడుతూ క్రీడాల్లో ఓడిపోయిన వారు బాధపడకుండా గెలుపు కోసం. తపన పడాలన్నారు. అనుభవం రేపటి పునాదికి గెలుపు అవుతుందని అన్నారు. మారుమూల ప్రాంతాల నుంచి ఎంతో మంది క్రీడాలను తీర్చిదిద్దిన పీడీలు, వ్యాయమ ఉపాధ్యాయుల కృషి అభినందనీయమాన్నరు. అనంతరం ఎంఈఓ రాజులు మాట్లాడుతూ..గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతోనే ఉమ్మడి జిల్లా రెజ్లింగ్ పోటీలను మండలంలో నిర్వహించినట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో ఎంపిక వారిని రాష్ట్రస్థాయి క్రీడాపోటిల్లో పాల్గొంటారని అన్నారు. అనంతరం గెలుపొందిన వారికీ బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రజిత వెంకటరామిరెడ్డి, ఎంఈఓ రాజులు, ఎస్ జి ఎఫ్ జిల్లా సెక్రెటరీ జిల్లా సెక్రెటరీ హీరా లాల్ నాయక్, రెజ్లింగ్ అధ్యక్షులు విజయ్ చౌహన్, సెక్రటరీ పవన్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహేందర్ రెడ్డి, రిటర్మెంట్ ఉపాధ్యాయులు ఆకుల కృష్ణయ్య, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
