వరంగల్, నవంబర్ 04 (ప్రజాజ్యోతి)::
- హనుమకొండ లో క్లౌడ్ భరస్ట్..!!
- ఒక్కసారిగా వాతావరణంలో మార్పు.. భారీ వర్షం
హనుమకొండ జిల్లా కేంద్రంలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. క్లౌడ్ భరస్ట్ అయ్యిందని చర్చించుకుంటున్నారు. ఒక్కసారిగా వాతావరణం మార్పు భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. ఒక్కసారిగా వాతావరణంలో మార్పును చూసి ప్రజలు భయాందోళన చెందారు. మంగళవారం ఉదయం ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చి భారీ వర్షం కురవడంతో జనాలు క్లౌడ్ భరస్ట్ అయ్యిందని చెప్పుకుంటున్నారు. నాలుగు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలమైన హనుమకొండ పట్టణం మరోసారి జలమయమైంది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోయాయి.
