ట్రాక్టర్ ను ఢీ కొట్టిన ట్రావెల్స్ బస్సు
నలుగురికి తీవ్ర గాయాలు
మిర్యాలగూడ, నవంబర్ 04,( ప్రజాజ్యోతి ):
నల్గొండ జిల్లా, మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలోని
వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం వద్ద అద్దంకి-నార్కెట్పల్లి హైవేపై తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో
ట్రాక్టర్ ను వెనుక నుంచి ఢీ కొట్టిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు..రోడ్డుపై బోల్తా పడ్డ ట్రాక్టర్.ఈ ప్రమాదంలో ట్రాక్టర్ పై ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలు.క్షతగాత్రులను మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.
బస్సు ఏపీలోని కావలి నుంచి హైదరాబాదుకు వెళ్తుండగా ఘటన.
ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు..తప్పిన పెను ప్రమాదం.
					