- విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో పాడి గేదె మృతి
పర్వతగిరి, నవంబర్ 02 (ప్రజాజ్యోతి)::
పర్వతగిరి మండలం దౌలత్ నగర్ గ్రామం కత్తుల వెంకటేశ్వర్లు కు సంబంధించిన పాలిచ్చే గేదెను రోజులాగే మేత కోసం వ్యవసాయ భూమి దగ్గరకు తీసుకెళ్లారు. మొంథ తుఫాన్ కారణంగా ఈదురు గాలులకు తెగిపడిన కరెంటు తీగలను నేటికి విద్యుత్ అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దింతో మేతకు వెళ్లిన గేదె కిందపడిపోయిన కరెంటు తీగలకు తాకి మృతి చెందిందని బాధితుడు కత్తుల వెంకటేశ్వర్లు తెలిపారు. మృతి చెందిన గేదె దాదాపు లక్ష 20 వేల విలువగలదాని ఉదయం 5 లిటర్లు సాయంత్రం 5 లీటర్ల పాలిచ్చే ఏది మృతి చెందడంతో ఉపాధి కూలిపోయామని అన్నారు. వెంటనే విద్యుత్ అధికారులు చర్యలు తీసుకొని మాకు తగిన న్యాయం చేయాలని వేడుకున్నారు.

