- వరి పొలంలో కొండచిలువ పాము.. భయాందోళనలో గ్రామస్తులు, రైతులు
పర్వతగిరి, నవంబర్ 02 (ప్రజాజ్యోతి)
పర్వతగిరి మండలం ఏనుగల్ గ్రామంలో పులి ప్రవీణ్ (ఆర్వెస్టర్) వారికోత మిషన్ తో పొలంలో వరి కోపిస్తున్న సమయంలో మిషన్ ఆపరేటర్ పొలంలో కొండచిలువ పామును గుర్తించి రైతులకు తెలిపారు. వెంటనే రైతులందరూ కలిపి కర్రల సహాయంతో కొండచిలువ పాములు చంపేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇళ్లకు ఆనుకొని వరి పొలాలు ఉండటం ఆ పొలాల్లోకి కొండచిలువ పాము రావటంతో గ్రామస్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యామని వెంటనే అధికారులు స్పందించి గ్రామాల్లో తిరుగుతున్నటువంటి కొండచిలువ పాముల నుండి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని కోరారు.

