“వరద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు”

Warangal Bureau
0 Min Read
  • “వరద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే”

వరంగల్/ప్రజాజ్యోతి:

హనుమకొండ జిల్లా గోపాలపూర్ లో భారీ వర్షాలతో ప్రభావితమైన వరద బాధితులను వర్దన్నపేట ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు పరామర్శించారు. బాధితుల సమస్యలను అడిగి తెలుసుకుని, అవసరమైన సహాయాన్ని అందించేందుకు అధికారులను ఆదేశించారు. ఈ సందర్బంగా రెవెన్యూ సిబ్బంది తో కలిసి ఎమ్మెల్యే బాధితులకు ఫుడ్ పాకెట్స్ అందించారు. రోడ్లు, డ్రైనేజీలు శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ తో శుభ్రం చేయాలని శానిటేషన్ సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గోపాలపూర్ జీపివో శోభారాణి, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *