- వరద బాధితులకు ఆహారపొట్లాలు, దుప్పట్లు పంపిణి చేసిన ‘మెరుగు అశోక్’
 
వరంగల్ తూర్పు, అక్టోబర్ 31 (ప్రజాజ్యోతి):
వరద బాధితులకు అండగా మేరుగు అశోక్ నిలిచారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని 35వ డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ మెరుగు అశోక్ మరియు 35వ డివిజన్ పద్మశాలి అధ్యక్షులు గడ్డం రవి నిన్న కురిసిన భారీ వర్షానికి నీట మునిగిన మైసయ్య నగర్ శివనగర్ బాధితులను పరామర్శించి వారికి ఆహార పొట్లాలు మరియు చెదర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో రాము, అంకతి అఖిల్, సాయి, రోషన్, తదితరులు పాల్గొన్నారు
					