- మొంథా తుపాన్ ఎపెక్ట్..సంగెం మండలంలో దంచికొడుతున్న వర్ష
- తిమ్మాపురం గ్రామంలో సిసి రోడ్లకు అండగా మట్టిపోయడంతో నిండిపోయినా ఇండ్లు
- ఎన్ని సార్లు సమాచారం ఇచ్చిన పట్టించుకొని అధికారులు
- లబోధీభోమంటున్న గ్రామ ప్రజలు
సంగెం,అక్టోబర్29(ప్రజాజ్యోతి):
మొంథా తుఫాన్ ప్రభావంతో వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలూ దంచికొడుతున్నాయి.సంగెం మండలంలోని గ్రామాలలో ఉదయం నుంచి వాన పడుతోంది.బలమైన ఈదురుగాలులకు పలు గ్రామాలలో చెట్ల కొమ్మలు విరిగిపోయాయి.తిమ్మాపురం గ్రామంలో సిసి రోడ్ల పై మట్టి అండగా పోయాడంతో పలు ఇండ్లు నిండిపొవడంతో స్థానిక ప్రజలు బయటికి వచ్చి గజగజ వణికిపోతున్నారు.ఇదే గ్రామానికి చెందిన ప్రజలు మట్టి తీయమని అధికారులకు మొర పెట్టుకున్న స్థానిక అధికారులు పట్టించుకున్న దాకలాలు లేవు.మొంథా తుపాన్ ప్రభావం భారీ వర్షాలు పడడంతో గ్రామ ప్రజలు బయటికి వచ్చి భయబ్రాంతులకు గురవుతున్నారు.ఇప్పటికైనా మండల అధికారులు స్పందించి గ్రామ ప్రజలను కాపాడాలని వేడుకుంటున్నారు

