పెట్రోల్ పంపులు, మినీ బ్యాంకులు మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

Warangal Bureau
1 Min Read
  • పెట్రోల్ పంపుల మినీ బ్యాంకులు మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పర్వతగిరి పోలీసులు

పర్వతగిరి, అక్టోబర్ 15 (ప్రజాజ్యోతి)

వరంగల్ కమిషనరేట్ లోని జనగాం, హనుమకొండ, వరంగల్ జిల్లాలలోని వివిధ మండలాలలో గల పెట్రోల్ పంపులు మరియు మినీ బ్యాంకులను టార్గెట్ చేసుకొని వారి వద్ద నుండి క్రెడిట్ కార్డు బిల్లులు కట్టాలని 50 వేల నుంచి 2 లక్షల వరకు వసూలు చేసి వారిని బురిడీ కొట్టించి పారిపోయే వ్యక్తిని పర్వతగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో అదుపులోకి తీసుకోవడం జరిగింది . ఇప్పటికే ఇతను పర్వతగిరి నెక్కొండ వర్ధన్నపేట లింగాల ఘనపూర్ రఘునాథపల్లి మండలాలలోని పెట్రోల్ బంకులు మరియు మినీ ఏటీఎంలో దాదాపుగా 6 లక్షల రూపాయల వరకు స్వాహా చేయడం జరిగింది అతని పేరు రాపోలు శ్రీనివాస్ తండ్రి ఐలయ్య వయసు 34 సంవత్సరాలు రెడ్యానాయక్ కాలనీ మహబూబాబాద్ జిల్లా. ఈరోజు ఇతని అదుపులోకి తీసుకొని విచారించగా ఫై నేరాలన్నీ ఒప్పుకోగా అతని వద్ద నుండి మూడు లక్షల రూపాయల నగదు మరియు ఆరు గ్రాముల బంగారం ఒక బ్లూ కలర్ యాక్టివా స్కూటీ మరియు ఒక సెల్ ఫోన్ రికవరీ చేసి అతడిని రిమాండ్ కు తరలించారు. ఈ సందర్భంగా పర్వతగిరి ఎస్ ఐ ప్రవీణ్ మాట్లాడుతూ పెట్రోల్ బంకులు మరియు మినీ ఏటీఎంల నిర్వాహకులు అధిక డబ్బులు ఇస్తాడు అని చెప్పేసి ఎవరికి కూడా గుర్తుతెలియని వ్యక్తులకు డబ్బులు పంపించి మోసపోవద్దని తెలియపరచడం జరిగింది. ఇతని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పర్వతగిరి ఎస్సై బి ప్రవీణ్, వారి సిబ్బందికి మామునూరు ఏసిపి ,ఈస్ట్ జోన్ డిసిపి, మరియు వరంగల్ సి పి అభినందనలు తెలపడం జరిగింది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *