సూర్యాపేట జిల్లా ప్రతినిధి అక్టోబర్ 19(ప్రజాజ్యోతి):ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని దాసాయిగూడెం లో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఐకెపి కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.రైతులు ప్రభుత్వ నిబంధన ప్రకారం తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు.కొనుగోలు కేంద్రాల్లో ఏవైనా ఇబ్బందులు ఉంటే రైతులు తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ, దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగెళ్ల కర్ణాకర్ రెడ్డి, పిసిసి ఎస్సి సెల్ వైస్ చైర్మన్ చింతమల్ల రమేష్, టిఎంసి శ్వేత, సి ఓ ఉమారాణి, అధ్యక్షులు శిరీష, ఆర్ పి సైదమ్మ, కమిటీ సభ్యులు పద్మ, శాంతమ్మ, నిర్మల, రైతులు తదితరులు పాల్గొన్నారు.