నూతన ఎస్సై కి సన్మానం
రామారెడ్డి అక్టోబర్ 16 (ప్రజా జ్యోతి)
రామారెడ్డి పోలిస్టేషన్ కీ నూతనంగ సబ్ ఇన్స్పెక్టర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన సందర్బంగా గురువారం వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎస్సై రాజశేఖర్ కు శాలువాతో సత్కరించి మర్యాద పూర్వకంగా కలిసి న బిఆర్ఎస్ మండల సీనియర్ నాయకులు పాల మల్లేష్, మాజీ వార్డు సభ్యులు రాజయ్య కె. భీరయి .రెడ్డి బిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు మలిదశ ఉద్యమ కారులు జీర్ల ఎల్లయ్య మాజీ రైతు బంధు సభ్యులు మస్కట్ నారాయణ,జీర్ల మల్లయ్య, కట్ట లింగం, తదితరులు కలిశారు. అనంతరం ఎస్సై రాజశేఖర్ మాట్లాడుతూ గ్రామ ములో అందరు కలిసిమెలిసి ఉండాలని, శాంతిభద్రతలకు అందరు సహకరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదు, అనేలైన్ సైబర్ మోసగాళ్ల వలలో పడకూడదని ఎవ్వరైనా అనుమాస్పదంగా ఊర్లలోకి వస్తే మాకు సమాచారం ఇవ్వాలని అన్నారు.