మహేశ్వరి ఆయిల్ పరిశ్రమ పై వివాదాలు లేవు
– ఆయిల్ పరిశ్రమ యజమాని సురేష్
–పరిశ్రమలోని కార్మికుల పూర్తి వివరాలను తెలిపారు.
. కార్మికులకు భద్రతతో పాటు ఇన్సూరెన్స్ ను కూడా కల్పిస్తున్నామన్నారు
భిక్కనూరు అక్టోబర్ 16 (ప్రజా జ్యోతి )
భిక్కనూరు మండలంలోని జంగంపల్లి శివారులలో గల 886 సర్వేలో ఉన్న మహేశ్వరి ఆయిల్ పరిశ్రమ ను గురించిన పూర్తి వివరాలు వెల్లడించడం లేదని మేనేజర్ సురేష్ పై ప్రచురితమైన వార్త కథనాల పట్ల స్పందించిన మేనేజర్ సురేష్ పరిశ్రమకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించాడు. అదేవిధంగా కార్మికులకు ఇన్సూరెన్స్, భద్రతా కార్డులు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. స్థానికుల పట్ల తమకు ఎటువంటి వివక్ష లేదని, వారికే మొదటి ప్రాధాన్యత ఉంటుందని, స్థానికులు ఉద్యోగాల కొరకు తమను సంప్రదించాలని తెలిపారు.పాత్రికేయుల సమక్షంలో పరిశ్రమ మొత్తాన్ని చూపించడం జరిగింది. పరిశ్రమ నుండి వెలబడుతున్న పదార్థాల వలన,వాయు కాలుష్యం లాంటి ఏమి సంభవించవని,ఎటువంటి హాని జరగదు అని స్థానికులు ఆందోళన చెందవద్దని పత్రిక ముఖంగా తెలియజేశారు. స్థానికులకు మరియు పాత్రికేయులకు పూర్తి సహకరించిన అంకుతి సురేష్ కుమార్ మేనేజర్ “ప్రజాజ్యోతి కి” ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.