బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. కోనసీమ జిల్లాలో ఆరుగురి దుర్మరణం

V. Sai Krishna Reddy
0 Min Read

ఆంధ్రప్రదేశ్ లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాయవరంలోని గణపతి గ్రాండ్ బాణసంచా తయారీ కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదం ధాటికి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ దుర్ఘటనలో ఆరుగురు కార్మికులు సజీవదహనమయ్యారు.

మరికొందరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పేలుడు జరిగిన సమయంలో ఈ బాణసంచా తయారీ కేంద్రంలో 40 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *