పరకాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పోలీస్ హెడ్ కానిస్టేబుల్‌ మృతి..

Warangal Bureau
1 Min Read
  • పరకాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..
  • పోలీస్ హెడ్ కానిస్టేబుల్‌ మృతి

పరకాల, సెప్టెంబర్ 30, (ప్రజా జ్యోతి):

హన్మకొండ జిల్లా పరకాల-హన్మకొండ ప్రధాన రహదారిపై కామారెడ్డిపల్లి వద్ద కంకర లోడుతో వెళుతున్న ఓ లారీ అదుపుతప్పి ఒక గొర్ల కాపరిని ఢీ కొట్టి, తర్వాత ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పోలీస్ హెడ్ కానిస్టేబుల్ రవీందర్‌తో పాటు మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. రవీందర్ పరకాల పోలీస్ స్టేషన్‌లో విధులు ముగించుకుని తన సొంత గ్రామమైన శాయంపేట మండలంలోని పత్తిపాకకు ద్విచక్ర వాహనంపై వెళ్లుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన ఇద్దరిని అత్యవసర చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ కానిస్టేబుల్ మృతి చెందాడు. 

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *