సూర్యాపేట మున్సిపాలిటీ స్థానిక 17వ వార్డ్ చింతల చెరువు ఆటో స్టాండ్ వద్ద ఉన్న దుర్గ మాత విగ్రహం వద్ద మాజీ కౌన్సిలర్ బైరబోయిన శ్రీనివాస్ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. బతుకమ్మ పాటలు పడుతూ, నృత్యాలు చేస్తూ సంబురంగా బతుకమ్మ సాగనంపారు. తెలంగాణ ఆడబిడ్డల పండుగ బతుకమ్మ. తెలంగాణ అతివలకు బతుకమ్మ ఈ లోటును పూడ్చింది. తీరొక్క పువ్వును తీసుకువచ్చి అందంగా బతుకమ్మ పేర్చి ఆడపడుచులు ఆడి పాడే వేడుక ఇది. ఎంగిలి పూలతో మొదలయ్యే బతుకమ్మ సంబరం తొమ్మిది రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. సోమవారం రోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా నేలపై పూల సింగిడి విరిసింది. తీరొక్క చెట్టుకు పూసిన పూలతో అక్క చెల్లెలు పేర్చిన బతుకమ్మలతో వాకిళ్లు కొత్త శోభను సంతరించుకున్నాయి. ఆడబిడ్డలు బతుకమ్మ ఆటతో ఊరువాడ సందడిగా మారాయి. మహిళలు గౌరమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. తొమ్మిది రోజులు కొల్చిన గౌరమ్మ ను రాత్రి వేళ నీటిలో నిమజ్జనం చేశారు. అనంతరం పసుపు,గంధాలు పుసుకొని మహిళలు సత్తుపిండి వాయనం ఇచ్చిపుచ్చుకున్నారు.తమ బతుకును చల్లగా చూడాలని గంగమ్మ ఒడికి చేరిన గౌరమ్మను వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు భైరబోయిన మాల్సూర్, కొరివి నవీన్, అలవాల వెంకన్న, అలవాల రాజశేఖర్, గంగరబోయిన రాకేష్,భైరబోయిన శ్రీనాథ్,బెజ్జరాబోయిన శ్రీకాంత్,భైరబోయిన భరత్,పులుగుజ్జు అనిల్, తుంగతుర్తి మణికంఠ, రెగట్టి సుమన్,రెగట్టి రేవంత్, రెగట్టి లీలా, సాయి,అలవాల అభి, దాసరి కార్తీక్, రావుల యశ్వంత్, గ్రామ పెద్దలు.బాల్త కుమారస్వామి, కుంచం సురేష్, రెగట్టి సైదులు, కుంచం రవి, శివరాత్రి నాగరాజు, శివరాత్రి సాయి, శివరాత్రి హరీష్, మహిళలు,పిల్లలు తదితరులు పాల్గొన్నారు.