మేడిపల్లి లో చిరుత దాడి
— భయాందోళనలో పరిసరాల గ్రామ ప్రజలు
గాంధారి సెప్టెంబర్ 28(ప్రజాజ్యోతి)
గాంధారి మండలంలోని మేడిపల్లి గ్రామ శివారులో ఆదివారం ఉదయం ఘోర ఘటన చోటుచేసుకుంది. స్థానిక రైతు కుర్మా సంతోష్‌కు చెందిన గొర్రెల మంద పై చిరుతపులి దాడి చేసింది. ఈ దాడిలో ఒక గొర్రె మృతి చెందింది.ఈ విషయాన్ని గమనించిన గ్రామస్థులు వెంటనే అక్కడికి చేరుకుని, అటవీ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. బాధిత కుటుంబానికి నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా గ్రామస్తులు ఎండీ అక్బర్, జి.సాయిలు, మల్లేష్ తదితరులు అక్కడ పాల్గొన్నారు. చిరుత పులి గ్రామ పరిసరాల్లో తిరుగుతుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.