నల్గొండ జిల్లా ముద్దుబిడ్డ డీఎస్పీగా ఎంపిక
నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణానికి చెందిన రావిరాల యశస్విని గ్రూప్ వన్ ఫలితాలలో 81వ ర్యాంకు సాధించి డీఎస్పీగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆమె తల్లిదండ్రులు రావిరాల వీరేందర్, సౌజన్య మాట్లాడుతూ.. యశస్విని పదవ తరగతి స్థానిక కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో, ఇంటర్మీడియట్ హైదరాబాద్ శ్రీ చైతన్యలో, బీటెక్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో పూర్తి చేశారని తెలిపారు. సొంతంగా ప్రిపేర్ అయి డీఎస్పీగా ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉందని, శనివారం ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకుంటారని తెలియజేశారు. ఈ వార్తతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, పద్మశాలి కులబాంధవులు, పట్టణవాసులు సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు.