మదర్ డెయిరీ డైరెక్టర్ల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హయత్ నగర్లో మూడు డైరెక్టర్ల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రెండు స్థానాలను బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. రచ్చ లక్ష్మీనర్సింహారెడ్డి, సుదగాని భాస్కర్ గౌడ్ విజయం సాధించగా, కర్నాటి జయశ్రీ మరో స్థానంలో గెలుపొందారు.
రెండు జనరల్, ఒక మహిళా డైరెక్టర్ స్థానానికి ఎన్నికలు నిర్వహించగా, మొత్తం తొమ్మిది మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు రెండు స్థానాలను గెలుచుకున్నారు.
ఈ ఫలితాల నేపథ్యంలో ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య, యాదాద్రి డీసీసీ అధ్యక్షుడు సంజీవరెడ్డి, మదర్ డెయిరీ ఛైర్మన్ మధుసూదన్ రెడ్డి వ్యవహారశైలిపై కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఎన్నికలకు ముందే తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ వ్యక్తిని మదర్ డెయిరీ ఎన్నికల్లో నిలబెట్టి మద్దతు ఇవ్వడం సరికాదని ఎమ్మెల్యే ఐలయ్య, డీసీసీ అధ్యక్షుడు సంజీవరెడ్డిపై సామేల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
