బెదిరిస్తున్న దుండగులనుండి
రక్షణ కల్పించండి…!
వృద్దురాలు అమ్ములు వేడుకొలు
మిర్యాలగూడ, సెప్టెంబర్ 24,( ప్రజాజ్యోతి ): అక్రమంగా తమ ఇంటిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన దుండగులు జైలు నుంచి బయటకు వచ్చి తిరిగి మా పైన కేసు పెడతావా నీ అంతు చూస్తామంటూ తమ ఇంటి చుట్టూ తిరుగుతూ బెదిరింపులకు గురి చేస్తున్నారంటూ దామరచర్ల మండలం కొత్తపేటతండా కు చెందిన ధనావత్ అమ్ములు అనే వృద్దురాలు ఆవేదన వ్యక్తం చేస్తుంది. పట్టణంలోని గెస్ట్ హౌస్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తన గోడు వెళ్ళబోసుకుంది. నిందితులపై కేసు పెట్టినప్పటికీ, బెయిల్ పై బయటికి వచ్చిన నాటి నుండి తమ ఇంటి చుట్టూ తిరుగుతూ మీ అంత చూస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని, సదరు వ్యక్తుల నుండి తమ కుటుంబానికి రక్షణ కల్పించాలంటూ కన్నీళ్ళతో వేడుకుంటుంది.
