- భూ బాధితులకు బహిరంగ మార్కెట్ ధర చెల్లించాలి
- గ్రీన్హై ఫీల్డ్ భూ బాధితుల డిమాండ్
- ఎంపీ కడియం కావ్యకు వినతి పత్రం
దామెర, సెప్టెంబరు 22(ప్రజాజ్యోతి):
నాగపూర్ అమరావతి కారిడార్, గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణంలో భూములను కోల్పోతున్న తమకు బహిరంగ మార్కెట్ ధర చెల్లించాలని భూ బాధితులు కోరారు. ఈ మేరకు సోమవారం హనుమకొండలో ఎంపీ కడియం కావ్యను దామెర మండల పరిధిలోని గ్రీన్ఫీల్డ్ హైవే భూ బాధిత రైతులు మర్యాద పూర్వకంగా కలిశారు. తాము మూడు పంటలు పండించుకునే విలువైన పంట భూములకు బహిరంగ మార్కెట్లో రూ.కోట్లు పలుకు తోందని తెలిపారు. కానీ ప్రభుత్వ మేమో రూ. లక్షల్లో ధర చెల్లిస్తామనడం అన్యాయ మని ఆవేదన వ్యక్తం చేశారు. లేదా టోల్ గేట్ రసుంలో బాధిత రైతులకు 70శాతం వాటా ఇవ్వాలని కోరారు. రైతుల సమస్యకు ఎంపీ కడియం కావ్య స్పందిస్తూ.. గ్రీన్ ఫీల్డ్ హైవే భూ బాధిత రైతుల బాధలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో బాధిత రైతులు బూర్గుల రాంచందర్రావు, బొల్లు రాజిరెడ్డి, నల్లెల్ల దేవేందర్, బొల్లు తిరుపతిరెడ్డి, అల్లం అనిల్, బొల్లు సమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
